రూ.300 కోట్లకు పైగా వసూలు చేసిన టాప్-10 సౌత్ మూవీస్ ఇవే!

-

బాహుబలి నుంచి మొదలైన సౌత్ మూవీస్ ప్రభంజనం.. ఎదురే లేకుండా సాగిపోతోంది. అలాంటి వాటిల్లో.. 300 కోట్లు కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్ ఇక్కడుంది. ఓ లుక్కేయండి.

1. బాహుబలి ది బిగినింగ్: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి-1.. రూ.300 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసిన మొదటి చిత్రం. 10 రోజుల్లో ఈ మార్క్ చేరుకుంది.

2. బాహుబలి ది కన్ క్లూజన్ : ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన రికార్డులన్నీ.. తుడిపేసి చరిత్ర క్రియేట్ చేసింది బాహుబలి-2. కేవలం 4 రోజుల్లోనే రూ. 300 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.

3. రోబో 2.0 : సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబోకు సీక్వెల్ గా వచ్చింది 2.0. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్.. కేవలం 3 రోజుల్లోనే రూ.300 కోట్లు (గ్రాస్) కొల్లగొట్టింది.

4. సాహో : బాహుబలి తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై.. ప్రభాస్ మేనియా ఏ స్థాయిలో ఉందే చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. అన్ని వర్గాలనూ ఆకట్టుకోలేకపోయినా.. కేవలం 4 రోజుల్లోనే రూ. 300 కోట్లు (గ్రాస్) రాబట్టింది.

5. బిగిల్ : కోలీవుడ్ తళపతి విజయ్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఈ మూవీ.. 17 రోజుల్లో రూ. 300 కోట్లు(గ్రాస్) వసూలు చేసింది.

6. పుష్ప : “తగ్గేదేలే” అంటూ పుష్పరాజ్ చేసిన హంగామా.. సిల్వర్ స్క్రీన్ తోపాటు ఆఫ్ లైన్ లోనూ అరాచకమే సృష్టించింది. సౌత్ నుంచి 300 కోట్ల క్లబ్ లో చేరిన 6వ చిత్రంగా నిలిచింది.

7. RRR : ఎన్టీఆర్-రామ్ చరణ్ తో జక్కన్న ఎలాంటి మ్యాజిక్ చేశాడా.. అని యావత్ దేశం ఎదురు చూసింది. దాని తీవ్రత ఎంతో.. బాక్సాఫీస్ వద్ద లెక్కతేలింది. కేవలం.. 2 రోజుల్లోనే రూ. 350 కోట్లు (గ్రాస్) కొల్లగొట్టింది.

8. KGF 2 : “యాక్షన్ సినిమాలకే బాప్”.. అన్నట్టుగా దుమ్మురేపింది కేజీఎఫ్ సిరీస్. సౌత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన సెకండ్ పార్ట్.. 2 రోజుల్లోనే రూ. 300 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.

9. విక్రమ్ : లోకనాయకుడి హీరోయిజం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూసిన ఆడియన్స్ కోసం.. ఏక్ దమ్ బిర్యానీలా వచ్చింది విక్రమ్. ఈ కమల్ కమ్ బ్యాక్ మూవీ.. 5 రోజుల్లో రూ. 300 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.

10. PS-1 : భారీ స్టార్ కాస్టింగ్ తో ఎవర్ గ్రీన్ డైరెక్టర్ మణిరత్నం చేసిన మ్యాజిక్ పొన్నియన్ సెల్వన్. 300 కోట్ల(గ్రాస్) మార్క్ దాటిన పదో సౌత్ మూవీ ఇది. 9 రోజుల్లో బెంచ్ మార్క్ క్రాస్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version