వికేంద్రీకరణ జరిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బలమైన వాదన పై చాలా బలంగా నిలబడుతున్నారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు నిరసనలు చేపడుతున్న అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పడానికి..వారు చేస్తున్న ఉద్యమం వారి చేత విరమించే ప్రక్రియ మొదలు పెట్టినట్లు వైసీపీ పార్టీలో వార్తలు వినపడుతున్నాయి.
ఒకపక్క అమరావతి రాజధాని విషయాన్ని చంద్రబాబు నాయుడు రాజకీయ అంశంగా చిత్రీకరిస్తూ తన మీడియా చేత లబ్ధి పొందాలని భావిస్తున్న చంద్రబాబు వ్యూహాలకు చెక్ పెట్టేలా జగన్ వ్యూహం రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని మార్పు తప్పదు.. కానీ మీకు న్యాయం చేస్తాం అని రైతులు భావించేలా కసరత్తు చేస్తున్నారట. నిలబడుతున్న వార్తల ప్రకారం రాజధాని ప్రాంతంలో ఉద్యమం చేస్తున్న రైతులకు జగన్ ప్రభుత్వం మరింత ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీని ప్రకారం ప్రభుత్వానికి లాండ్ పూలింగ్ కింద ఇచ్చిన భూములకు అదనంగా మరో 200 గజాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాకుండా మరో మూడు సంవత్సరాలు కూడా జగన్ కౌలు చెల్లించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ దెబ్బకు జగన్ ఇచ్చే ఆఫర్ కు అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేస్తున్న రైతులు ఆపేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.