ఆకస్మికంగా ఆయన తన ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఇవాళ ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. అయితే.. ఆయన ఇవాళ తన ప్రచారానికి బ్రేక్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది.
దేశం మొత్తం ఎన్నికలు ఉన్నా… ఏపీలో మాత్రం రసవత్తరంగా ఉన్నాయి. ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఓవైపు టీడీపీ… మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. నువ్వా నేనా అన్న రేంజ్ లో ఉన్నారు. బిగ్ ఫైటే అన్నట్టుగా ఉన్నా.. ఎందుకో ఏపీలో వార్ వన్ సైడ్ అనిపిస్తోంది.
అయితే.. వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. చంద్రబాబు.. తన పదవిని మళ్లీ నిలబెట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎన్నో కుట్రలు, కుత్రంతాలకు తెర కూడా తీశారు.
అయితే.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఈసారి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేస్తున్నారు. ఆయన ఏది చేసినా ఒక కారణం ఉంటోంది. ఎన్నికలు మూడు నాలుగు నెలలు ఉన్నాయనగా తన పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కా ప్లాన్ గా ముందుకెళ్తున్నారు జగన్.
అయితే.. ఆకస్మికంగా ఆయన తన ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఇవాళ ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. అయితే.. ఆయన ఇవాళ తన ప్రచారానికి బ్రేక్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది. ఇవాళ ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. జిల్లా వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రచారం ఎలా సాగింది.. దానిపై ప్రజల స్పందన ఏంటి.. మున్ముందు ప్రచారం ఇంకెలా నిర్వహించాలి అనే దానిపై పార్టీ నేతలతో చర్చించడం కోసమే మంగళవారం జగన్ ప్రచారానికి బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంకా ఎన్నికలకు 9 రోజులే ఉండటంతో వచ్చే వారం రోజులు ప్రచారం విస్తృతంగా జరపాలని… దానిపై సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని యోచిస్తున్నారట. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో జగన్ పని చేస్తున్నారు.