ప్రముఖ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మెజిస్టేట్ కోర్ట్ ఏడాది పాటు శిక్ష ఖరారు చేసింది. తనపై వస్తున్న ఈవార్తలకు స్పందించిన మోహన్ బాబు 2009లో సలీమ్ సినిమా టైంలో డైరక్టర్ వైవిఎస్ చౌదరికి సినిమాకు సంబందించిన మొత్తం చెల్లించాం. అయితే మా బ్యానర్ లో మరో సినిమా చేయడానికి 40 లక్షల చెక్ ఇచ్చాం.
సలీమ్ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో చౌదరితో మరో సినిమా వద్దని అనుకున్నాం. అయితే ఆ చెక్ బ్యాంక్ లో వెయ్యవద్దని చెప్పాం. కాని దాన్ని బ్యాంక్ లో వేసి నాపై చెక్ బౌన్స్ కేసు వేశారు. ఇది కోర్టుని తప్పు దోవ పట్టించడమేనని అన్నారు మోహన్ బాబు. అందుకే వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందని.. అయితే ఈ కేసు విషయమై తాము సెషన్స్ కోర్ట్ లో వేస్తామని ఛాలెంజ్ చేశారు మోహన్ బాబు. కొన్ని ఛానెల్స్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాటిని అసలేమాత్రం నమ్మొద్దని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మోహన్ బాబు.
Clarification of Cheque bounce issue by Dr.M Mohan Babu garu @themohanbabu @iVishnuManchu @HeroManoj1 pic.twitter.com/jPFlrqb2KN
— Vamsi Shekar (@UrsVamsiShekar) April 2, 2019