మళ్ళీ గెలవకపోతే..జగన్‌కు క్లారిటీ వస్తుందా?

-

ఇటీవల ఏపీ రాజకీయాల్లో సి‌ఎం జగన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆయన ఓ లాజిక్ ప్రకారమే మాట్లాడుతున్నారు..లేక యాదృచ్చిక్కంగా మాట్లాడుతున్నారా? అనేది క్లారిటీ రావడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నారు. అయితే తాము అంతా మంచి పనులే చేశామని, అన్నీ ఎన్నికల్లో గెలిచామని కాబట్టి ఈ సారి 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

కానీ 175 టార్గెట్ పెట్టుకున్నారు…కాకపోతే గత ఎన్నికల్లో మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఈజీ కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో పరిస్తితి వేరు..అప్పుడు అధికారంలో ఉన్న టి‌డి‌పిపై తీవ్ర వ్యతిరేకత ఉంది..జగన్ పాదయాత్ర ప్రభావం ఉంది..జనసేన ఓట్ల చీలిక ప్రభావం..వీటి వల్ల వైసీపీకి 151సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు సీన్ వేరుగా ఉంది. వైసీపీపై వ్యతిరేకత ఉంది..సంక్షేమ పథకాల పేరుతో ఎన్ని డబ్బులు పంచినా..పన్నుల భారం పెంచడం వల్ల ప్రజలు ఏమి సంతృప్తిగా లేరు

అటు టి‌డి‌పి పుంజుకుంటుంది..అదే సమయంలో జనసేన తో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది. దీంతో వైసీపీకి కాస్త పరిస్తితులు కలిసొచ్చేలా లేవు. పైగా టి‌డి‌పిపై కక్ష సాధిస్తూ..ఆ పార్టీని బలోపేతం చేసిందే వైసీపీ అని చెప్పవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ పైకి 175కి 175 అంటున్నారు గాని..పొరపాటున ఈ సారి మనం అధికారంలోకి రాకపోతే ఇబ్బందే అని, ఈ సారి అధికారం దక్కకపోతే తాను రాజకీయాల్లో ఉండే పరిస్తితి లేదని జగన్ తాజాగా తెనాలి సభలో వ్యాఖ్యానించారు.

అంటే నెక్స్ట్ గెలవమనే ఆలోచన జగన్ కు వస్తుంది..అందుకే పరోక్షంగా ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారి అధికారం గాని రాకపోతే వైసీపీ పరిస్తితి ఎలా ఉంటుందనేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version