ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలో రూ. 10 లక్షలతో గదులు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 1,330 నిర్మాణంలో ఉన్నాయని మంత్రి సత్యనారాయణ వివరించారు. సచివాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
అదనంగా మరో 1,465 ఆలయాలను నిర్మించాలని నిర్ణయించామని, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కూడా 200 వరకు వినతులు వచ్చాయని చెప్పారు. నిర్మించిన ప్రతి దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగేలా అర్చకులను నియమించి నెలకు రూ.5000 చొప్పున ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
శ్రీశైలంలో కొత్తగా దాతల ద్వారా చేపట్టే నిర్మాణాల్లో 40% ఆదాయం దేవస్థానానికి లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో చీరల కాంట్రాక్టులో దోపిడీకి అవకాశమే లేదని, బిడ్డింగ్ లో ఎక్కువ పాడుకున్న వారికే టెండర్ అప్పగిస్తున్నామని తెలిపారు.