సచివాలయంకి స్థలం ఎంపిక చేసిన జగన్ సర్కార్…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కు తగ్గడం లేదు. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే జగన్ ముందుకి వెళ్ళాలి అని పట్టుదలగా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే విశాఖలో రాజధాని ఏర్పాటుకి సంబంధించి ఇప్పటికే అన్నీ ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా అయినా సరే ఉగాది నుంచి పాలన మొదలుపెట్టాలని పట్టుదలగా ఉన్నారు జగన్.

ఈ మేరకు ఇప్పటికే కీలక శాఖల అధికారులకు ఆయన ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సమాచారం. విశాఖపట్నంలోని మధురవాడలో మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మించే దిశగా సర్కారు చర్యలు చేపడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని భావించినా.. కొన్ని అనివార్య కారణాలతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

మండలిలో బిల్లులు పెండింగ్ లో పడినా సరే జగన్ మాత్రం వెనక్కు తగ్గే పరిస్థితి కనపడట౦ లేదు. కాపులుప్పాడ కొండపై ఐటీ సంస్థల కోసం గతంలో ఐటీ లేఅవుట్‌ను రూపొందించారు. అదానీ సంస్థ ఆ కొండపై డేటా పార్క్‌ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అక్కడ స్థలం కేటాయించారు. అయితే అధానీ గ్రూప్ అక్కడి నుంచి ఖాళీ చెయ్యాలని భావించింది. దీనితో అక్కడే సచివాలయం సహా కొన్ని శాఖలను ఏర్పాటు చెయ్యాలని జగన్ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version