వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ టికెట్ తనకేం అంటూ ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణకు జనసేన నేత షాక్ ఇస్తున్నారు.. చాప కింద నీరులా టికెట్ ప్రయత్నాలను సదరు నేత ముమ్మరం చేస్తున్నారట.. దీంతో మాజీ మంత్రి పొంగూరు నారాయణ డైలమాలో పడ్డారని సిటీ నియోజకవర్గంలో ప్రచారం నడుస్తోంది.. ఇంతకీ మాజీ మంత్రికి టికెట్ వస్తుందా..??
వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీ నేతలు చెబుతున్న నేపథ్యంలో సీట్ల పంపకాలపై చర్చ నడుస్తోంది.. కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు జనసేనకు కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట.. నెల్లూరు ప్రకాశం చిత్తూరు తో పాటు రాయలసీమ జిల్లాలలో టిడిపి అభ్యర్థులు కు టికెట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.. అయితే టిడిపి చేస్తున్న వ్యూహాత్మక ఆలోచనలకు జనసేన నేతలు అడ్డు తగులుతున్నారు..
నాలుగేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. అప్పటివరకు సిటీ ఇన్చార్జిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ని కాదని పొంగూరు నారాయణ కి ఇంచార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు.. అయితే ఇటీవల టిడిపి జనసేన పొత్తు ఆశలు చిగురించడంతో జనసేన నేతలు కూడా టిక్కెట్లను ఆశిస్తున్నారు.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు.. పొత్తుల్లో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ టికెట్ తనకే వస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు..
ఈ ప్రచారం మాజీ మంత్రి పొంగూరు నారాయణకు చిరాకు తెప్పిస్తోందట.. తనను కాదని మనుక్రాంత్ రెడ్డి కు టికెట్ ఎలా వస్తుందని పొంగూరు నారాయణ తన అనుచరుల వద్ద చెబుతున్నారట.. అవసరమైతే టిక్కెట్ కోసం పోటీపడుతున్న నేతలను డబ్బులతో కొనేస్తానని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తానే పోటీ చేస్తానని నారాయణ చెబుతున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. ఇంతకీ పొత్తుల్లో భాగంగా నెల్లూరు సిటీ సీటు జనసేనకు పోతుందా లేక టీడీపీ తీసువుంటుందా చూడాలి..