గత ఎన్నికల్లో జనసేన గెలిచింది కేవలం ఒకే ఒక సీటు..రాజోలులో జనసేన గెలిచింది. గెలిచిన ఎమ్మెల్యే కూడా వెంటనే వైసీపీలోకి జంప్ చేశారు. అయితే గత ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ఈ సారి తప్పకుండా రివెంజ్ తీర్చుకుని సత్తా చాటాలని పవన్ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ సారి మంచి ఫలితాలు రాబట్టాలని భావిస్తున్నారు. టిడిపితో పొత్తు ఉన్నా లేకపోయినా..ముందు జనసేన సొంతంగా సత్తా చాటేలా పవన్ పనిచేస్తున్నారు.
ఈ సారి జనసేనకు మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో జనసేనకు బాగా ఓట్లు పడిన స్థానాల్లో గెలవాలని ప్లాన్ చేశారు. పొత్తు ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తారు..పొత్తు లేకపోయినా జనసేన సింగిల్ గా గెలిచేలా ప్లాన్ చేస్తున్నారు. అలా జనసేన సింగిల్ గా గెలిచే అవకాశాలు ఉన్న మొదట మూడు సీట్లు భీమవరం, రాజోలు, నరసాపురం..ఈ సీట్లు ఖచ్చితంగా జనసేన ఖాతాలో పడేలా ఉన్నాయి.
ఇక జనసేన సింగిల్ గెలిచే సత్తా ఉన్న నాల్గవ సీటు అమలాపురం అసెంబ్లీ.. ఈ సీటుని సోలోగానే కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ జనసేనకు బలం ఎక్కువ. గత ఎన్నికల్లో వైసీపీకి 72 వేలు పడితే..టిడిపికి 46 వేలు, జనసేనకు 45 వేలు ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి, జనసేన దగ్గరగా ఉన్నాయి. ఇక పొత్తు ఉంటే ఖచ్చితంగా ఈ సీటు జనసేన తీసుకోవాలని చూస్తుంది. పొత్తు ఉంటే భారీ మెజారిటీతో గెలవడం ఖాయం.
ఇక పొత్తు లేకపోయినా ఒంటరిగానైనా గెలవాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ మంత్రి పినిపే విశ్వరూప్‌కు మైనస్ ఉంది. కోనసీమ జిల్లా విషయంలో వైసీపీకి నెగిటివ్ ఉంది. వైసీపీ బలం తగ్గింది. అదే సమయంలో టిడిపి బలం అనుకున్న మేర పెరగలేదు. జనసేన అనూహ్యంగా పుంజుకుంది. పైగా ఇక్కడ పవన్ పర్యటన ఉంది. దీంతో అమలాపురంలో జనసేన ఆధిక్యంలోకి వచ్చి..గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.