టీడీపీలో కాకరేపుతున్న మాజీ ఎమ్మెల్యే కామెంట్స్.. ఇసుక దొంగలు మావాళ్లే అంటూ వీడియో..

-

ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టి మాట్లాడటంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ముందుంటారు.. ప్రత్యర్దులపై తీవ్రమైన విమర్శలు చెయ్యడంతో పాటు.. పార్టీలో ఉండే లోటుపాట్లను మొఖమాటం లేకుండా చెబుతుంటారు.. చంద్రబాబు హాజరైన సమావేశాల్లో సైతం తన స్టయిల్ లోనే మాట్లాడుతుంటారు..తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని.. ఎలాంటి అవినీతి అక్రమాలు జరక్కుండా పటిష్టంగా అమలు చేస్తున్నామని చెబుతున్న చంద్రబాబుకు.. జేసీ షాక్ ఇచ్చారు.. ఇసుక అక్రమ రవాణా చేసేది తమ పార్టీకి చెందిన వారే అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.. దీంతో టీడీపీ ఇరకాటంలో పడింది.. ఆయన కామెంట్స్ స్పందించేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు..

టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. జేసీ చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను అడ్డం పెట్టుకుని ఎన్నో ఉద్యమాలు చేశారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే ఆదాయవనరుగా మార్చుకున్నారని జేసీ కామెంట్స్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.. దీన్ని చంద్రబాబునాయుడు ఎలా సెట్ చేస్తారో చూడాలి..

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version