సికింద్రాబాద్ లోని మహత్మ గాంధీ విగ్రాహానికి బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డా నివాళ్లు అర్పించారు. నేటి ఉదయం నుంచి పెద్ద హైడ్రామ తర్వాత కాసేపటికి క్రితం జేపీ నడ్డా మహత్మ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తు.. సికింద్రాబాద్ లోని మహత్మ గాంధీ విగ్రహానికి జేపీ నడ్డా నివాళ్లు అర్పించారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కే. లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజసింగ్, రఘు నందర్ రావు, ఈటల రాజేంధర్ అలాగే నాయకులు వివేక్ తో పాటు మరి కొందరు కరోనా నిబంధనలతో నివాళ్లు అర్పించారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తు బీజేపీ నాయకులు నల్ల మాస్క్ లు ధరించారు.
కాగ గాంధీ విగ్రాహానికి నివాళ్లు అర్పించిన తర్వాత నేటి సత్యగ్రహం పూర్తి అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కార్యకర్తలు అందరూ కరోనా నిబంధనలు పాటిస్తు ఇంటికి వెళ్లాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిద్దామని తెలిపారు. దీని తర్వాత మహత్మ గాంధీ విగ్రాహం నుంచి రాణిగంజ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేపీ నడ్డా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు.