ఎడిట్ నోట్: రెండు వైపులా ‘ఎన్టీఆర్‌’..!

-

తెలుగుదేశం పార్టీలో ఎప్పటినుంచో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. అయితే ఎన్టీఆర్‌ని చంద్రబాబు దూరం చేస్తూ వస్తున్నారనే ప్రచారం వచ్చింది. అటు ఎన్టీఆర్ సైతం సైతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు..పార్టీ పరమైన అంశాల జోలికి రావడం లేదు. అసలు రాజకీయాల గురించే మాట్లాడటం లేదు. పైగా ఏపీ రాజకీయాల్లో పలు అంశాలపై న్యూట్రల్‌గా స్పందిస్తూ వచ్చారు.

దీంతో ఎన్టీఆర్ టీడీపీకి అనుకూలంగా లేరనే ప్రచారం వచ్చింది..అటు వైసీపీ శ్రేణులు ఏమో..బాబు కావాలని ఎన్టీఆర్‌ని తోక్కేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని వైసీపీ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టీడీపీకి తారక్ ఇంకా దూరమే అని మాట్లాడుకుంటున్న సందర్భంలో..తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌లో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ టీంని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం ఆర్‌ఆర్‌ఆర్ టీంని అభినందిస్తూ ట్వీట్ చేశారు..ఇక దీనికి ఎం‌ఎం కీరవాణి థాంక్యూ సర్ అని రిప్లై ఇచ్చారు. అదే సమయంలో ఎన్టీఆర్ సైతం థాంక్యూ సో మచ్ మావయ్యా అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా రిప్లై ఇవ్వడంతో మళ్ళీ ఎన్టీఆర్..చంద్రబాబుకు దగ్గరయ్యారని, టీడీపీ కోసం పనిచేస్తారని చెప్పి తెలుగు తమ్ముళ్ళు తెగ సంబర పడుతున్నారు. ఇదే సమయంలో జగన్ సైతం ఆర్‌ఆర్‌ఆర్ టీంకు అభినందనలు తెలపడం..దానికి రిప్లైగా ఎన్టీఆర్ థాంక్యూ సర్ అని పెట్టడం జరిగింది.

దీంతో ఎన్టీఆర్ రెండువైపులా కవర్ చేశారని అంతా అనుకుంటున్నారు. అందరికీ రిప్లైలు ఇస్తున్న క్రమంలో బాబుకు ఇచ్చారని, ఎలాగో మావయ్య కాబట్టి..చుట్టరికం కలిపి థాంక్స్ చెప్పారని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ అందరినీ కవర్ చేసేశారు. మరి రానున్న రోజుల్లో టీడీపీ కోసం రంగంలోకి దిగుతారో లేక ఇలాగే రాజకీయాలకు దూరంగా ఉంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version