చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని! అనేది కేవలం పాటగానే మిగిలిపోలేదు. పాలేరు నుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి నిజం చేసి చూపించారు. ఆపదలో ఉన్నవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి.. దుఃఖంలో ఉన్న వారికి ఆయన నేనున్నానంటూ.. అనుని త్యం ఆదుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా.. ఆపదలో ఉన్నవారిని ఆదు కోవడంలో ఆయన రికార్డు సృష్టిస్తున్నారు.
ముఖ్యంగా పేదలు, అణగారిన కుటుంబాల్లోని వారు అకాల మరణం చెందినా, వృద్ధాప్యం చేత సాధారణ మరణం సంభవించినా.. అలాంటి కుటుంబాలు.. అంత్యక్రియలు చేసేందుకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలోఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే కందాళ ఎంతో చొర వ చూపిస్తున్నారు. ఆయా కుటుంబాలకు.. మట్టి ఖర్చుల కోసం తక్షణం.. రూ.10 వేల చొప్పున సాయం చేస్తున్నారు.
అంతేకాదు.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కూడా ఆపన్న హస్తం అందిస్తున్నారు. వారిని కూడా ఆదుకుంటున్నారు. యుద్ధప్రాతిపదికన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతోపాటు వారి కుటుం బాలకు సమాచారం చేరవేయడంలోనూ, ధైర్యం చెప్పడంలోనూ కందాళ టీం వడివడిగా పనిచేస్తున్న విషయం స్థానికంగా ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఇలా.. మొత్తంగా నియోజకవర్గం వ్యాప్తంగా కందాళ ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్నవారికి.. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి సేవ చేస్తూ.. వారికి నేనున్నాననే ధైర్యం ప్రసాదిస్తున్నారు.
ఇప్పటి వరకు కందాళ ఫౌండేషన్ ద్వారా దాదాపు కోట్లాది రూపాయలను ఆపదలో ఉన్నవారికి విరాళాలు గా అందించారు. మరింత మొత్తాన్నిఆయన గుప్తదానాలుగా కూడా చేశారు. సాయం చేయడంలో కులం, మతం, రాజకీయాలు వంటివాటికి ఎక్కడా చోటు పెట్టకుండా.. కందాళ దూసుకుపోతున్నారు.