కర్ణాటక ఎన్నికల ఫలితాలు..రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తాయా? అంటే పూర్తి స్థాయిలో కొంతమేర ప్రభావం మాత్రం ఉంటుందనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా గాని కర్ణాటకలో కాంగ్రెస్ పాగా వేసింది..హాంగ్ వస్తుందని ప్రచారం జరిగినా..కాంగ్రెస్ వన్ సైడ్ గా గెలిచింది. 224 సీట్లు ఉన్న కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ 113 దాటి కాంగ్రెస్ 136 సీట్లు సొంతం చేసుకుంది. అటు బిజేపి 64 సీట్లలో గెలిచింది. ఇక జేడిఎస్ 20 సీట్లకే పరిమితమైంది. ఇతరులు 4 చోట్ల గెలిచారు.
మొత్తానికి కన్నడ నాట కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి. అయితే కర్ణాటక అటు తెలంగాణకు, ఇటు ఏపీకి బోర్డర్ లో ఉంది. రెండు రాష్ట్రాలు కర్ణాటకకు దగ్గరే. అలాగే కర్ణాటకలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. అయితే తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో వారు కాంగ్రెస్ వైపు ఉన్నారని అర్ధమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉంటూ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఏం చేయని బిజేపిని ప్రజలు నమ్మడం లేదు.
దీని బట్టి చూస్తే తెలంగాణలో బిజేపికి కాస్త ఇబ్బంది రావచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ కు కాస్త ఊపు వస్తుంది..అలా అని అధికార బిఆర్‌ఎస్‌కు చెక్ పెట్టడం సులువు కాదు. ఇక ఏపీలో ఎలాగో కాంగ్రెస్ సత్తా చాటలేదు. అక్కడ వైసీపీ, టీడీపీ, జనసేనలు ఉన్నాయి. ఇక్కడ అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ కర్ణాటకలో పరాజయంతో బిజేపి అలెర్ట్ అవ్వవచ్చు. ఇప్పటికే టిడిపి-జనసేన..బిజేపితో పోత్తు కోసం చూస్తున్నాయి. దీంతో బిజేపి..ఆ రెండు పార్టీలతో కలిసే ఛాన్స్ ఉంది.