కాషాయ జెండానే జాతీయ జెండా అవుతుంది : క‌ర్నాట‌క మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

రాబోయే రోజుల్లో కాషాయ జెండానే జాతీయ జెండా అవుతుంద‌ని క‌ర్నాట‌క మంత్రి కేఎస్ ఈశ్వర‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు ఉన్న జాతీయ జెండా క‌న్న వేల సంవ‌త్స‌రాల ముందు నుంచే కాషాయ జెండా ఉంద‌ని అన్నారు. శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, ఆంజ‌నేయుడు వారి ర‌థ‌ల‌పై కాషాయ జెండానే ఎగ‌ర‌వేశార‌ని అన్నారు. అయితే ఇప్పుడు మూడు రంగుల జెండా జాతీయ జెండా గా ఉంద‌ని అన్నారు. ఇప్పుడు దాన్ని అందరూ గౌర‌వించాల‌ని అన్నారు.

అయితే రాబోయే రోజుల్లో మాత్రం కాషాయ జెండానే జాతీయ జెండా మారుతుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొద‌ట్లో తాము ఆయోద్యలో రామ మందిరం నిర్మిస్తామంటే.. అంద‌రూ నవ్వార‌ని అన్నారు. కానీ ఇప్పుడు తాము నిర్మిస్తున్నామ‌ని అన్నారు. ఇలాగే వ‌చ్చే 100 ఏళ్లు లేదా 200 ఏళ్లు 500 ఏళ్ల‌కు అయినా.. జాతీయ జెండాగా కాషాయ జెండా ఉంటుంద‌ని అన్నారు. ఎర్ర‌కోట‌పై కాషాయ జెండా ఎగ‌ర‌వేసే రోజులు వ‌స్తాయ‌ని అన్నారు. కాగ ఈ వ్యాఖ్య‌ల‌పై పెను దుమారం రేగుతుంది. జాతీయ జెండాను అవ‌మానించిన మంత్రి వెంట‌నే బ‌హిరంగ క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version