రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు వేయడం..అందులో సక్సెస్ అవ్వడం అనేది కేసిఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. మళ్ళీ తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న కేసిఆర్..వ్యూహాత్మక ఎత్తుగడలతో దూసుకెళుతున్నారు. ఊహించని విధంగా 119 సీట్లకు 115 సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేసి ప్రత్యర్ధుల కంటే ముందున్నారు. అయితే 9 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చారు తప్ప..మిగతా సీట్లలో పెద్దగా మార్పులు లేవు.
అలాగే కాంగ్రెస్, టిడిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చారు. దీంతో సీటు ఆశించిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులకు అదిరే షాక్ ఇచ్చారు. ఎలాగో 115 సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అందులో సిపిఐ, సిపిఎం పార్టీలు ఆశించిన సీట్లు ఉన్నాయి. ఇంకా పెండింగ్ లో ఉన్న నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్లలో కమ్యూనిస్టులకు బలం లేదు. కాబట్టి కేసిఆర్..కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చారని తేలిపోయింది. అయితే సిపిఐ, సిపిఎం పార్టీలు చెరో ఐదు సీట్లు అడిగినట్లు తెలిసింది.
కానీ కేసిఆర్ మాత్రం చెరోక సీటు ఇవ్వడానికే ఫిక్స్ అయ్యారట. అయితే కనీసం చెరో రెండు సీట్లు అడగాలని కమ్యూనిస్టులు అనుకున్నారట..కేసిఆర్ అపాయింట్‌మెంట్ కూడా అడిగారట. కానీ కేసిఆర్ ఛాన్స్ ఇవ్వలేదని తెలిసింది. పైగా కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి..కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందనేది కేసిఆర్ అంచనా.
అయితే మునుగోడు ఉపఎన్నికలో ఓ రకంగా బిఆర్‌ఎస్ గెలవడానికి కమ్యూనిస్టులే కారణం..అక్కడ సిపిఐ, సిపిఎంలకు 20 వేల ఓట్లు వరకు ఉన్నాయి. బిఆర్‌ఎస్ 10 వేల ఓట్లతో గెలిచింది. అప్పుడు అలా వాడుకుని ఇప్పుడు కమ్యూనిస్టులని కేసిఆర్ సైడ్ చేశారు..మరి కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలుస్తారేమో చూడాలి.