ఏందో కేసీఆర్ సారు దగ్గర నుంచి ఇలాంటి మాటలు రాలేదు…మరి ఫ్రస్టేషన్‌లో వచ్చాయా? లేక బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టాలని మాట్లాడారా? అనేది క్లారిటీ లేదు గాని..అనూహ్యంగా దేశ రాజ్యాంగమే మార్చేయాలని కేసీఆర్ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. స్వాతంత్ర భారతావనికి అంబేడ్కర్ సరికొత్త రాజ్యాంగం అందించారు. ఇక రాజ్యాంగ రూపకల్పనకు అంబేడ్కర్ ఎంత కష్టపడ్డారో చెప్పాల్సిన పని లేదు. ఆ రాజ్యాంగమే మన దేశ నడకకు మూలం. అయితే ఎప్పుడన్నా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు రాజ్యాంగ సవరణలు చేశారు తప్ప…రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరు డిమాండ్ చేయలేదు.
ఆఖరికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇక తానే దేశాన్ని కాపాడే నేత అన్నట్లు మాట్లాడేశారు. సరే విమర్శలు చేస్తే చేశారు…కానీ రాజ్యాంగం మార్చాలని చెప్పి డిమాండ్ ఎందుకు పెట్టారు? అంటే ఇది కేవలం రాజకీయ పరమైన ఆకాంక్ష తప్ప మరొకటి కాదని అర్ధమవుతుంది. ఏదో దేశ రాజకీయాలని తన వైపు చూడాలని అన్నట్లుగా కేసీఆర్ ప్లాన్ చేశారు.
ఎలాగో విపక్షాలు, కేంద్రంలోని బీజేపీపై యుద్ధం చేస్తున్నాయి. అయితే విపక్షాలని ఏకం చేసి కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని కేసీఆర్ చూస్తున్నారు..కానీ అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అందుకే అనుకుంటా ఏదైనా సంచలన వ్యాఖ్యలు చేస్తే జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతామని కేసీఆర్ భావించినట్లు ఉన్నారు…ఈ క్రమంలోనే రాజ్యాంగం మార్చాలని అతి పెద్ద తప్పు స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాజకీయంగా రాజ్యాంగం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఎంత హడావిడి చేసిన కేసీఆర్ రాజకీయం వర్కౌట్ అవ్వడం కష్టమే.