గెలవాలంటే త్యాగం తప్పదు..కారులో కేసీఆర్ కీ స్టెప్.!

-

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి నేటికీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే టి‌ఆర్‌ఎస్ కాస్త ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న కే‌సి‌ఆర్..పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే టార్గెట్ గా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గెలుపుకు సంబంధించి పలు వ్యూహాలని నేతలకు వివరించారు. ఇదే సమయంలో పార్టీ పరిస్తితిపై సర్వే రిపోర్టులు కూడా తెప్పించుకున్న కే‌సి‌ఆర్..ఎమ్మెల్యేల పనితీరుని వివరించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కూడా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా, హైదరాబాద్ లోనే తిరుగుతున్నారని కే‌సి‌ఆర్ ఫైర్ అయ్యారు. ఇకనైనా ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని అన్నారు. ఎన్నికలు అయ్యే వరకు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. అదే సమయంలో సరైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలకు కే‌సి‌ఆర్ గట్టిగా క్లాస్ ఇచ్చారు.

బి‌ఆర్‌ఎస్ పార్టీకి మొత్తం 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇందులో 42 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని రిపోర్టులు వచ్చాయి. దీనిపై కే‌సి‌ఆర్ సీరియస్ అయ్యారు. వీరంతా మెరుగైన పనితీరు కనబర్చాలని లేదంటే సీట్లు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశారు. దాదాపు సిట్టింగులకే సీట్లు ఇస్తానని, కానీ ఎన్నికల సమయానికి ఏ ఎమ్మెల్యే పనితీరు బాగోకపోయినా వారిని పక్కన పెట్టేస్తానని చెప్పుకొచ్చారు.

అయితే ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఈ లోపు ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పడాలంటే కష్టమే. అంటే కొంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు ఉండవనే చెప్పాలి. వారు సీట్లు త్యాగం చేయక తప్పదు. లేదంటే బి‌ఆర్‌ఎస్ పార్టీ గెలుపుకే ఇబ్బంది. ఏదేమైనా అందరూ ఎమ్మెల్యేలకు మాత్రం కే‌సి‌ఆర్ సీటు ఇచ్చే ఛాన్స్ లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version