ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వివేకా నందరెడ్డి హత్యకేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. మొదటి నుంచి ఈ కేసుపై ఎన్నో అనుమానాలు ఉన్నా.. వాటిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ కేసులో సీబీఐ తన మార్కును చూపించింది. కొంతకాలంగా ఈ కేసులో సైలెంట్‌గా ఉంటున్న సీబీఐ ఇప్పుడుమళ్లీ విచారణ చేస్తోంది.
ఇందులో భాగంగా సోమవారం కడప జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలులో గల గెస్ట్ హౌస్‌లో అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇది రెండో దశ విచారణ అని అధికారులు వివరిస్తున్నారు. ఇందులో మొదటిరోజు వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరిపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు.
దస్తగిరిని విచారించిన సందర్భంగా సీబీఐ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. వీటిని అధికారులు రికార్డ్ చేసి త్వరలోనే వాటిపై కూడా నిఘా పెడతారని సమాచారం. అక్కడి నుంచి దస్తగిరిని పులివెందులకు తీసుకెల్లిన సీబీఐ అధికారులు అక్కడ కూడా హత్యా కోణంలో కీలక విషయాలపై ప్రశ్నలు వేసినట్టు సమాచారం. దాని తర్వాత దస్తగిరిని వదిలేశారు అధికారులు. అయితే త్వరలోనే మరోసారి దస్తగిరిని విచారిస్తారని సమాచారం. ఆ తర్వాత ఈ కేసులో ఆరోఎపణలు ఎదుర్కొంటున్న అనుమానితులందరినీ వరుసపెట్టి విచారించే అవకాశం ఉంది.