అధికారంలోకి రావడానికి నవరత్నాలు అనౌన్స్ చేశారు. ఆ విధంగా అన్ని పథకాల అమలుకు ఎన్నో ఇబ్బందులు చవి చూసి మూడేళ్ల కాల వ్యవధిలో లక్షా 40 వేల కోట్ల రూపాయలు వెచ్చించారు. అంతేకాదు కొన్ని సార్లు తాహతుకు మించి అప్పులు చేశారు. కొన్ని బ్యాంకులు ఏపీ సర్కారు రుణ దాహం తీర్చలేమని కూడా చెప్పాయి. ఇవన్నీ మరిచిపోయి 90శాతం మేరకు మ్యానిఫెస్టోలు చెప్పిన పనులన్నీ చేసేశా అని చెప్పడం, మే పది నుంచి గ్రామాగ్రామాన తిరిగి గడపగడపకూ వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడం ఒక్క కొడాలి నానికే చెల్లు అని టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇవన్నీ టీడీపీ కార్యకర్తలకూ, వైసీపీ కార్యకర్తలకూ మధ్య నడుస్తున్న వాగ్వాదం. ఆ విధంగా కాదు ఏ విధంగా చూసుకున్నా మూడేళ్లలో తాము చెప్పాలనుకున్నవి చేయాలనుకున్నవి చెప్పేశాం చేసేశాం అని చెప్పడమే పెద్ద విడ్డూరం.
పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయాలనుకున్నా లేదా చంద్రబాబును టార్గెట్ చేయాలనుకున్న మంత్రి కొడాలి నాని రూటే వేరు. ఆయనేం మాట్లాడినా అవన్నీ వైసీపీ అధినేత మనసులో మాటలకు అనుగుణంగానే ఉంటాయి. అంతే తప్ప ఆయనకు వేరే ఉద్దేశాలు ఏవీ ఉండవు, ఉండబోవు కూడా! అని అంటున్నారు విపక్ష నేతలు కాస్త వ్యంగ్య రీతిలోనే ! పవన్ కు అజెండా లేదని అని చెప్పడం, ఆయన ఎంచుకున్న విషయాలపై ఆయనకే అవగాహన లేదని చెప్పడం లాంటివి కూడా సీఎం జగన్ చెబితే చెబుతున్నారా అని కూడా అంటున్నారు జనసేన నాయకులు. తాము ఎంచుకున్న విషయాలు ఇప్పటికే రాష్ట్రాన్ని కదిపి కుదిపేస్తున్న విషయాలు అని, వీటిపై కాస్త స్పందిస్తూ వెళ్తే మిగతా విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు తాము సిద్ధమేనని అంటున్నారు వీరంతా !
పార్టీని అధికారంలోకి మళ్లీ తీసుకురావడం రీజనల్ కో ఆర్డినేటర్ల బాధ్యతేం కాదు, వాళ్లు కూడా అందులో ఓ భాగం అంతే !
ఎవరి కృషి, స్థానిక అనుకూలత అన్నవి ఆధారంగానే గెలుపు, ఓటములు అన్నవి ఆధారపడి ఉంటాయి అని అంటున్నారు కొడాలి నాని. ఆ విధంగా ఆయన వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎలా పనిచేయాలో మాత్రం చెప్పి తప్పుకుంటున్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాదు ఇవాళ మరో ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్లలోనే మ్యానిఫెస్టో పూర్తయిందని అంటున్నారు. నిజంగానే అలా జరిగిందా ? జరిగితే ఏం జరిగింది అన్నది ఓ సారి చూద్దాం.