తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత, ప్రచారంతో ప్రజల ముందుకు పార్టీలన్నీ తమ అభ్యర్థులను గెలిపించమని వెళుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ప్రతి నియోజకవర్గము, నియోజకవర్గంలోని ప్రతి ఓటరు అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి.
కోరుట్ల నియోజకవర్గం ఇది ఉద్యమాల పురిటిగడ్డ. విద్యా కేంద్రంగా విలసిల్లిన ప్రాంతం. ఇది ఒకప్పటి కాషాయం కంచుకోట. తర్వాత గులాబీ రెపరెపలతో బిఆర్ఎస్ పట్టు సాధించుకుంది. ఈసారి ఈ నియోజకవర్గం నుంచి సీనియర్ నేతల వారసులు బరిలో దిగుతున్నారు. మూడు పార్టీలు ముగ్గురు దీటైన అభ్యర్థులను పోటాపోటీగా నిలబెట్టారు. బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతో ఈసారి రెండు పార్టీలు దీటైన అభ్యర్థులని బరిలో దించారు. బిఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ ని బరిలో దించగా, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ను పొట్టిగా నిలబెట్టారు. కాంగ్రెస్ తరపున జువ్వడి నరసింగరావు బరిలో ఉన్నారు.
నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాయని బిఆర్ఎస్ ప్రజల ముందుకు వెళుతుండగా, ప్రతిపక్ష పార్టీలు కోరుట్లను బిఆర్ఎస్ సమస్యల నిలయంగా మార్చిందని, అభివృద్ధి ఊసే లేదని విమర్శిస్తూ ప్రజల ముందుకు వెళుతున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బిఆర్ఎస్ ను ఇంటికి పంపిస్తారని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి
ఏది ఏమైనా కోరుట్లలో త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఎన్నికల వేళ ఓటరు ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే….