పాదయాత్రలో బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గట్టిగా ఫైర్ అయ్యారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని ట్వీట్ చేశారు. ఓవైపు విశ్వగురు ఏమో ఉచితాలు వద్దు అని చెబుతోంటే.. మరోవైపు ఈ జోకర్‌(బండి సంజయ్‌ని ఉద్దేశిస్తూ) ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు అంటూ హామీలు ఇస్తారేంటని మండిపడ్డారు.

దేశాన్ని పాలిస్తోంది బీజేపీయా కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దేశవ్యాప్తంగా ఓ సరైన నిర్ణయం తీసుకునే సత్తా లేదా అని నిలదీశారు. దేశం మొత్తానికి ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు ఇచ్చేలా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేేశపెట్టుకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని కేటీఆర్ అడిగారు.

నాలుగో విడత పాదయాత్రలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో పర్యటించిన బండి సంజయ్‌కు కాలనీవాసులు తమ సమస్యలను చెప్పుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యా వైద్యం అందించడంతోపాటు అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలోనే బండి వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version