బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. బండి సంజయ్ కు దమ్ముంటే.. మళ్లీ మా గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలుపు.. ఈ సారి గంగుల కమలాకర్ లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కనీసం రూ. 3 కోట్ల నిధులైనా తెచ్చాడా.. అని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్ర వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా..? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కోసం బండి సంజయ్ ఏనాడైనా కేంద్రాన్ని అడిగాడా అంటూ ప్రశ్నించారు. డబ్బలో రాళ్లేసి ఊపినట్లు ఒకటే లొల్లి చేస్తడని విమర్శించారు.