ఏపీలో లేటెస్ట్ సర్వే.. ఆ స్థానాల్లో వైసీపీదే లీడ్.!

-

ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో ఏపీలో సర్వే సంస్థల హడావిడి పెరిగింది..ప్రజల నాడి పట్టుకునేందుకు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే అంశంపై నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు సొంతంగా సర్వేలు చేయిచుకుంటున్నాయి. ఇక కొన్ని థర్డ్ పార్టీ సంస్థలు సైతం సర్వేల్లో నిమగ్నమయ్యాయి. అయితే ఏపీలో శ్రీ ఆత్మసాక్షి సంస్థ..ఎప్పటినుంచో సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో ఇటీవల ఆ సంస్థ..ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెలువడ్డాయి. ఈ సర్వేలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీదే ఆధిక్యం అని తేలింది. ఏపీలో మొత్తం 29 ఎస్సీ, 7 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 27 ఎస్సీ స్థానాలని వైసీపీ గెలుచుకుంది. టీడీపీ-జనసేన చెరోకటి గెలుచుకున్నాయి. ఇక 7 ఎస్టీ స్థానాలని వైసీపీనే కైవసం చేసుకుంది.

అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ బలం తగ్గి, టీడీపీ బలం పెరిగినట్లు తెలుస్తోంది. కానీ ఓవరాల్ లీడ్ మాత్రం వైసీపీకే ఉందట. 7 ఎస్టీ స్థానాల్లో 5 స్థానాల్లో వైసీపీకి లీడ్ ఉంది. పాలకొండ, సాలూరు, రంపచోడవరం, పోలవరం, అరకు స్థానాల్లో వైసీపీకి లీడ్ ఉంది. పాడేరులో రెండు పార్టీల పరిస్తితి బాగోలేదు..అంటే ఇక్కడ పోటాపోటి ఉంది. కురుపాంలో ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణిపై యాంటీ ఎక్కువ ఉంది. ఇక్కడ టీడీపీ తరుపున బలమైన అభ్యర్ధిని పోటీకి దింపితే..వైసీపీకి చెక్ పెట్టవచ్చు.

అటు ఎస్సీ స్థానాల్లో దాదాపు 15 స్థానాల్లో వైసీపీకి లీడ్ ఉండగా టీడీపీకి 7-8 స్థానాల్లో బలం పెరిగిందని తెలుస్తోంది. రాజోలు సీటులో జనసేనకు ఆధిక్యం ఉంది. మిగిలిన సీట్లలో వైసీపీ-టీడీపీల మధ్య పోటాపోటి వాతావరణం ఉంది. అయితే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version