కమలం స్ట్రాటజీ చేంజ్..స్కెచ్ అదిరింది!

-

రాజకీయాల్లో వ్యూహాలు అనేవి చాలా ముఖ్యం..వ్యూహాలు ద్వారానే ప్రత్యర్ధులకు చెక్ పెట్టొచ్చు…సరైన సమయంలో సరైన వ్యూహాలు వేసి…ప్రత్యర్ధులకు చెక్ పెడితే రాజకీయాల్లో విజయాలు ఆటోమేటిక్ గా వస్తాయి..అలా విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ బాగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది..2019 పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీ అంటే ఒక చిన్న పార్టీ…ఏదో ఒకటి, రెండు సీట్లు గెలుచుకునే కెపాసిటీ గల పార్టీ..అంతే..అంతకుమించి బీజేపీకి సీన్ లేదు.

అసలు ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది పెద్ద కల…కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆ కలని సాకారం చేసుకునే దిశగానే బీజేపీ ముందుకెళుతుంది..ఆ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలవడం దగ్గర నుంచి తర్వాత ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడంతో బీజేపీ ఒక్కసారిగా రేసులోకి వచ్చింది…బలమైన కాంగ్రెస్ పార్టీని సైతం వెనక్కి నెట్టి, అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే అసలైన పోటీ అనే విధంగా రాజకీయం చేయడం మొదలుపెట్టింది..అలా అలా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటూ…వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది.

ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకు కదులుతుంది. అయితే అంతా బాగానే ఉంది..బీజేపీ బాగానే పోరాడుతుంది…కాకపోతే బీజేపీకి ఉన్న అతి పెద్ద ఇబ్బంది ఏంటంటే…ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడం…ఏదో కొన్ని ప్రాంతాల్లో బలం ఉంది గాని…రాష్ట్ర స్థాయిలో పూర్తి బలం లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఉన్నట్లు బీజేపీకి రూట్ లెవెల్ లో బలం లేదు.

అయితే ఇప్పుడు ఆ బలం పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది..బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 34 వేల బూత్ లని టార్గెట్ చేసుకుని కమిటీల నిర్మాణం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు…ఎన్నికల నాటికి బూత్ స్థాయిలో మరింత బలపడేలా బండి ప్లాన్ చేస్తున్నారు…ఈ ప్లాన్ గాని సక్సెస్ అయితే తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కడం ఈజీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version