‘గాడ్సే’గా సత్యదేవ్ వచ్చేస్తున్నాడు..రిలీజ్ డేట్ లాక్‌డ్

-

విలక్షణ నటుడు సత్యదేవ్..తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ మూవీస్ సెలక్షన్ తో దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ ఈ హీరో ఓ వైపున టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరో వైపున బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నాడు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’లో కీల క పాత్ర పోషిస్తున్నాడు.

మరో వైపున టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్.. చిరు‘ గాడ్ ఫాదర్’ ఫిల్మ్ లో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సంగతులు పక్కనబెడితే..సత్యదేవ్ నటిస్తున్న చిత్రం ‘గాడ్సే’ అప్ డేట్ ఇచ్చేశాడు.

ఈ ఏడాది జూన్ 17న ‘గాడ్సే’ ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు సత్యదేవ్. ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. గాడ్సే ఫిల్మ్ డైరెక్టర్ గోపి గణేశ్..గతంలో సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ అనే సినిమా చేశాడు. ఆ పిక్చర్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘గాడ్సే’ కూడా డెఫినెట్ గా అంచనాలను మించి విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version