ఏపీలో టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి అనేక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటివరకు అనేక రకాల కథనాలు రాగా, తాజాగా టీడీపీ-జనసేన పొత్తు గురించి సరికొత్త కథనం నడుస్తోంది. ఇంతవరకు రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే చర్చ నడిచిన విషయం తెలిసిందే..అలాగే చంద్రబాబు, పవన్ సైతం పరోక్షంగా పొత్తు గురించి మాట్లాడారు. జనసేన నుంచి పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలనే డిమాండ్ వినిపించింది. కానీ దీనికి టీడీపీ ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు…అవసరమైతే ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుతామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇదే సమయంలో తాజాగా పవన్..పొత్తుపై తేల్చేశారు…తన పొత్తు ప్రజలతోనే అని చెప్పి…పరోక్షంగా టీడీపీతో పొత్తు లేదన్నట్లే చెప్పుకొచ్చారు.
అయితే జనసేనతో పొత్తు లేకపోతే టీడీపీకే ఎక్కువ నష్టం జరిగే ఛాన్స్ ఉంది…ఎందుకంటే టీడీపీకి రాజకీయ భవిష్యత్ ఉండాలంటే…ఇదే చివరి ఛాన్స్…ఈ ఎన్నికల్లో గాని గెలవకపోతే…నెక్స్ట్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్తితి ఇంకా దిగజారుతుంది. ఇక జనసేన ఇప్పుడుప్పుడే ఎదుగుతున్న పార్టీ కాబట్టి, నెక్స్ట్ ఓడిన భవిష్యత్ లో పుంజుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి పొత్తు అనేది టీడీపీకి బాగా ముఖ్యం. ఖచ్చితంగా జనసేనతో పొత్తు ఉంటే వైసీపీని నిలువరించగలదు. ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.
అందుకే చంద్రబాబు…పొత్తుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాబు సరికొత్త ఫార్ములాతో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది…ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాతో ముందుకు రానున్నారని తెలిసింది…అంటే రెండున్నర ఏళ్ళు లోకేష్ సీఎంగా, మరో రెండున్నర ఏళ్ళు పవన్ సీఎంగా ఉండేలా ప్లాన్ చేయనున్నారని సమాచారం.
అంటే ఇంకా చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చోరని కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే చినబాబుకు సీఎం అయ్యే ఛాన్స్ దొరికినట్లే..అటు పవన్ కోరిక తీరుతుంది. కానీ ఇదంతా మీడియాలో వస్తున్న కథనాలే…ఇందులో నిజనిజాలు ఏంటి అనేవి ఎవరికి తెలియవు..దీనిపై చంద్రబాబే క్లారిటీ ఇవ్వాలి.