తన కూతురిని పెళ్ళి చేసుకున్నాడని దళితుడైన అల్లుడిని చంపేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన మారుతీ రావు….అగ్ర కులానికి చెందినవాడు. అతనికి అమృత అనే కూతురు ఉండటం జరిగింది. చిన్ననాటి నుండి అమృత నీ చాలా గారాలపట్టి గా పెంచిన మారుతీ రావు… కూతురు పెళ్లి విషయంలో కులం గోడలు అడ్డురావడంతో కూతురు ప్రేమించిన దళితుడిని అడ్డంగా కిరాయి గూండాల చేత నరికి చంపించడం అప్పట్లో సెన్సేషనల్ న్యూస్ గా నిలిచింది.
కూతురి తర్వాత ఆమె కన్న బిడ్డకు తాతయ్యారు. ఆ బిడ్డని కూడా తక్కువ కులం వాడిగా చూసి.., పసిబిడ్డ సహా అన్నీ వదిలేసి కూతురును వచ్చేయమని బెదిరించి తాతగా ఓడిపోయారు. మనిషిగా అన్ని విధాల ఓడిపోయి చివరాకరికి తన ఆత్మ ని హత్య చేసుకున్నాడు. తక్కువ కులానికి చెందిన వాడితో నా కూతుర్ని ఇవ్వటమే అహంతో మారుతీ రావు చనిపోవడం పట్ల అందరూ ఒకటి అంటుంది కులం మరియు అహం మామ అల్లుళ్ళ చావుకు కారణం అని అంటున్నారు.