కాంగ్రెస్‌ను చిరు వ‌దిలేసిన‌ట్టే… ఆ ఆన్స‌ర్‌తోనే చెప్పేశాడు…

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా… ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అనుష్క ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో చిరు బిజీబిజీగా గడుపుతున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిరు చెన్నై, బెంగుళూరు లాంటి నగరంలో పర్యటిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరుని అక్కడి ఓ మీడియా ప్రతినిధి ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించగా నేను ప్రస్తుతం సినిమా పార్టీలో ఉన్నానని సమాధానం ఇస్తూ నవ్వారు చిరు.

ఇక చిరు ఇచ్చిన ఈ షాకింగ్ ఆన్స‌ర్ చూస్తే చిరు కాంగ్రెస్‌కు దూరం అయిన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయిన చిరు ఆ త‌ర్వాత కాంగ్రెస్ పాలిటిక్స్‌లో అంత యాక్టివ్‌గా లేరు. కాంగ్రెస్ ఏమైనా కోలుకుంటుందా ? అని ఈ యేడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు కొంత‌లో కొంత ఆశ‌తో ఉన్న చిరుకు ఇప్పుడు పెద్ద షాక్ త‌గిలిన‌ట్ల‌య్యింది.

ఇక ఇప్పుడు చిరు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. అస‌లు తాను కాంగ్రెస్‌లో ఉన్న‌ట్టే లేరు. వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటున్నారు. ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న సైరా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే మ‌ళ్లీ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాను స్టార్ట్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాను ఇప్పుడు సినిమా పార్టీలో ఉన్నాన‌ని చెప్ప‌డం ద్వారా కాంగ్రెస్‌లో ఉన్నాన‌ని చెప్పేందుకు కూడా ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. అయితే గియితే ఇప్పుడు చిరు పార్టీ మారాలి అనుకుంటే ఆయ‌న చూపు బీజేపీ మీద ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇటు త‌మ్ముడు జ‌న‌సేన పార్టీ న‌డుపుతున్నాడు. మ‌రో సోద‌రుడు నాగ‌బాబు కూడా అదే పార్టీలో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో చిరు పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఎలా ? ఉంటుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version