23 కాదు మూడే .. చెల్లుబోయిన జోస్యం !

-

తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో రెండ్రోజుల పాటు మ‌హానాడు జరుగుతోంది. ఒంగోలు కేంద్రంగా ఈ వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో చంద్ర‌బాబు క‌న్నా ముందే జ‌గ‌న్ మంత్రులు జ‌నంలోకి వెళ్లారు. సామాజిక న్యాయ భేరి పేరిట బ‌స్సు యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర సంద‌ర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 23 సీట్లు కూడా రావ‌ని, మూడు సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని జోస్యం చెప్పారు. ఈ జోస్యం నెర‌వేరుతుందా లేదా అన్న‌ది చూడాలిక !

తెలుగుదేశం పార్టీ క‌న్నా వైసీపీ జనంలోకి దూసుకుపోతోంది. అయితే అధికారంలో ఉన్న పార్టీ క‌నుక క్షేత్ర స్థాయిలో పెద్ద‌గా ఇబ్బందులు రావు అని అనుకునేందుకు లేదు. ఆ పార్టీకి ఎక్క‌డిక‌క్క‌డ అవ‌మానాలు, అడ్డగింత‌లు త‌ప్ప‌డం లేదు. అయితే ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నిర్వ‌హించిన బాదుడే బాదుడే కార్య‌క్ర‌మ ప్ర‌భావం కూడా జ‌నంపై స్ప‌ష్టంగా ఉంది. క‌నుక అతి విశ్వాసానికి పోయి మంత్రులు మాట్లాడ‌డం కూడా అంత మంచిది కాదు అన్న భావ‌న సొంత పార్టీలోనే వినిపిస్తోంది.

ఇక నినాదాల విష‌య‌మై మాట్లాడుకుంటే క్విట్ జ‌గ‌న్ అని ఒక‌రు క్విట్ చంద్ర‌బాబు అని మ‌రొక‌రు వినిపిస్తున్నారు. ఇవేవీ ఇంత వేగంగా తేలేవి కావు. రాజ‌కీయం అన్నాక విప‌క్షం, స్వ‌ప‌క్షం రెండూ ఉండాలి. ప్ర‌శ్నించే విప‌క్షం లేని స‌భ‌ల‌ను చూశాం. ప్ర‌శ్నించినా స‌మాధానాలు ఇవ్వ‌క మాట‌ల దాడులు చేసిన స‌భ‌లూ చూశాం. క‌నుక ఒకసారి టీడీపీ త‌ప్పిదం చేస్తే మ‌రోసారి వైసీపీ అదే త‌ప్పిదం చేసి మేమేం త‌క్కువ అని అనిపించుకోవ‌డంలో వింతేం లేదు. క‌నుక ఎవ‌రి ఎదుగుద‌ల ఎవ‌రి ప‌త‌నం అన్న‌ది వారి,వారి నిర్ణ‌యాలు అనుసార‌మే ఉంటాయి కానీ అందుకు వేరేగా కార‌ణాలు వెత‌క‌డం భావ్యం కాదు. ప్ర‌జ‌లే అంతిమ నిర్ణేత‌లు క‌నుక పాల‌న లో ఉన్నంత వ‌ర‌కూ అధికారం ఉన్నంత వ‌ర‌కూ అతి విశ్వాసం కార‌ణంగా ఇబ్బందులు త‌ప్ప‌వు.

అలా అని టీడీపీ త‌ప్పులు చేయ‌లేదా అంటే చేసింది.. మ‌రి! టీడీపీని దాటించే విధంగా జ‌గ‌న్ పాల‌న ఉంటే అప్పుడు చెల్లుబోయిన జోస్యం ఒక‌టి ఫ‌లించే అవ‌కాశం ఉండ‌వ‌చ్చు. అప్పుడు కూడా 3 కాదులేండి ఓ 30 స్థానాలు టీడీపీవి కావొచ్చు.లేదంటే ఓ 60 నుంచి 70 స్థానాలు టీడీపీవి కావొచ్చు. ఇదే జ‌గ‌న్ పాల‌న న‌చ్చ‌క జ‌నం ఒక‌వేళ తిరుగుబాటు చేశారే అనుకోండి అప్పుడు 23 సీట్లే వైసీపీకి రావొచ్చు.. లేదా అంత‌కు మించి ఒక‌ట్రెండు సీట్లు అధికంగా వ‌చ్చినా ఆశ్చ‌ర్యం పొంద‌న‌వ‌స‌రం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version