దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టే సమయాల్లో మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం అవుతున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వరుస పేలుళ్లు సంభవించడంతో వాహనదారుల్లో విముఖత కనిపిస్తోంది. తాజాగా మరో టాప్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీకి చెందిన వాహన షోరూంలో ఎలక్ట్రిక్ వాహనాలు పేలి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో షోరూంలో ఉన్న కొన్ని వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఈ ఘటనపై అథర్ సంస్థ స్పందిస్తూ.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ప్యూర్ ఈవీ, జితేంద్ర ఈవీ టెక్, ఓలా ఎలక్ట్రిక్, ఒకినావాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదానికి గురయ్యాయని, ఈ ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించిందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను వచ్చే వారం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు సమర్పిస్తామన్నారు.