ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్రౌడ్ ఫండింగ్ నిర్వహించడంపై యాదాద్రి-భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీపై పరోక్షంగా స్పందించారు.
ప్రస్తుతం మాజీ సీఎం కేజ్రీవాల్, సీఎం ఆతిశీ క్రౌడ్ ఫండింగ్ చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూప్ యాక్టివ్‌గా లేనందువల్లే ఈ ఎన్నికల్లో సీఎం అతిశీ క్రౌడ్ ఫండింగ్‌కు చేస్తున్నారని విమర్శించారు.
గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ తరఫున ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో డీల్ చేశారని, ఇప్పుడు అది ఇనాక్టివ్‌లో ఉండటం వలన ప్రజల నుంచి చందాలు అడుక్కోవాల్సి వచ్చిందని భువనగిరి ఎంపీ సెటైర్లు వేశారు. సౌత్ గ్రూప్ డీలింగ్ వల్లే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పాలిటిక్స్ చేసిందని, బీజేపీ అధికారంలో ఉందంటే దానికి కారణం కూడా సౌత్ గ్రూప్ డీలింగే కారణమని విమర్శలు గుప్పించారు. కాగా, ఢిల్లీ ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలు అవుతుందని క్రౌడ్ ఫండింగ్ చేయాలని ఆతిశీ కోరుతున్నారు.