కరోనా నివారణ చర్యల లో ఏపీ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. వైరస్ ని ఎదుర్కోవడానికి అవసరమైన మెటీరియల్ని సిద్ధం చేసుకోవడానికి చాలా దూకుడుగా ఇటీవల జగన్ సర్కార్ వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కువ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని దక్షిణ కొరియా దేశం నుండి రాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొన్ని రోజుల క్రితం తేప్పించడం జరిగింది. అయితే ఈ కిట్స్ కొనుగోలు విషయంలో జగన్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొన్ని రోజుల నుండి ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద హైలైట్ గా చర్చనీయాంశంగా మారింది. ఒక్కో టెస్టింగ్ కిట్ 730 రూపాయలకు దక్షిణ కొరియా దేశం నుండి లక్ష కిట్లను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే అంత ధర ఉండదని ధర ఎక్కువ చూపిస్తూ జగన్ సర్కార్ అవినీతి చేసిందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణ.
ఈ రాపిడ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా పది నిమిషాలలో రిజల్ట్ వస్తుంది అని జగన్.. ప్రధాని మోడీ కి వివరంగా అని విషయాలు చెప్పడం జరిగిందట. ఇటువంటి పరిస్థితిలో కన్నా వాటినేమి పాటించుకోకుండా ఇష్టానుసారంగా జగన్ ప్రభుత్వం పై అవినీతి అంటూ ఆరోపణలు చేయడం పట్ల వైస్సార్సీపీ నాయకులు ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట.
మరి ఈ విషయం లో మోడీ ఇన్వాల్వ్ అయితే కన్నా అధ్యక్షా పదవి ఊడిపోయే అవకాశం ఉందని ఏపీ రాజకీయాలలో టాక్. కన్నా చెప్పినట్టు టెస్టింగ్ కిట్స్ విషయంలో జగన్ సర్కార్ అవినీతికి పాల్పడింది అంటే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ సర్కార్లు కూడా అవినీతికి పాల్పడినట్లే అని వైస్సార్సీపీ నేతలు అంటున్నారు. ఎందుకంటే టెస్టింగ్ కిట్స్ కొనుగోలులో అధిక ధరకు దేశవ్యాప్తంగా కొనుగోలు చేసింది బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి.. కన్నా ఆరోపణలు సొంత పార్టీని ఇరుకున్న పెట్టె విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.