పారిశుధ్య కార్మికుల కోసం కేటిఆర్ ఏం చేసారో చూడండి…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అమితమైన గౌరవం ఇస్తుంది. తమ రాష్ట్రంలో ఉన్న పారిశుధ్య కార్మికులు ఎంత బాగుంటే తెలంగాణాలో కరోనా వైరస్ అంత కట్టడి అవుతుందని భావిస్తున్న తెలంగాణా సిఎం కేసీఆర్ వారి కోసం… సిఎం గిఫ్ట్ కింద నగదు బహుమతులను అందించడం గమనార్హం.

ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక తాజాగా మంత్రి కేటిఆర్ వారిని కలిసారు. సామాజిక దూరం పాటిస్తూ.. వారందరికీ భోజ‌నం ఏర్పాటు చేశారు మంత్రి కేటీఆర్ ప్రతి కార్మికుడిని పలకరించి, యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకోవడం, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకుని, కుటుంబ సభ్యుల గురించి అడగడం వంటివి చేసారు కేటిఆర్. వారితో కలిసి భోజనం కూడా చేసారు.

ఇక ఆయనే వారికి స్వయంగా భోజనం వడ్డించడం గమనార్హం. క‌రోనా నియంత్ర‌ణ‌లో విశిష్ట సేవ‌లు అందిస్తున్న శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జి, డి.ఆర్‌.ఎఫ్ సిబ్బందికి కూడా పూర్తి జీతంతో పాటు ప్రోత్స‌హ‌కాల‌ను సీఎం కేసీఆర్ మంత్రి వారికి వివరించారు. ఎవరు కూడా భయపడవద్దని అందరికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని మంత్రి ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసారు. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటామని అన్నారు కేటిఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version