ప్రధాని నరేంద్రమోడీ శనివారం శ్రీలంకలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదేశ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. అనంతరం ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్య, పరస్పర సహకారంపై కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ క్రమంలోనే శ్రీలంక నేవీ పట్టుకున్న భారత జాలర్లను విడుదల చేయాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ క్రమంలోనే పట్టుబడిన జాలర్లను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది. నిన్న ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో భాగంగా మానవతా దృక్పథంతో మత్స్యకారుల విడుదలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.ఈ మేరకు శ్రీలంక 11 మంది భారత జాలర్లను విడుదల చేసినట్లు తెలిసింది.