వైశ్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు విసిరేయించ‌డం నాకు తెలుసు.. చంద్రబాబుపై మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో

-

చంద్రబాబుకు నీతి, న్యాయం లేదని.. ఎదుటి వ్యక్తి బాగుంటే చూసి ఓర్వలేని గుణం చంద్రబాబుదని మోహన్‌బాబు అన్నారు. చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ లేదని తెలిపారు.

ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చంద్రబాబుది కాదని.. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఎన్నో కష్టా పడి.. ఏపీ అంతా తిరిగి.. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని.. అలాంటి వ్యక్తి చేతుల్లోనుంచి అన్యాయంగా పార్టీని చంద్రబాబు లాక్కున్నారని మోహన్ బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబుది లాక్కున్న భోజనం అంటూ వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఇవాళ సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వైశ్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు విసిరేయించ‌డం త‌న‌కు తెలుస‌న్నారు.

చంద్రబాబు నీతి, న్యాయం లేని వ్యక్తి

చంద్రబాబుకు నీతి, న్యాయం లేదని.. ఎదుటి వ్యక్తి బాగుంటే చూసి ఓర్వలేని గుణం చంద్రబాబుదని మోహన్‌బాబు అన్నారు. చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ లేదని తెలిపారు. చంద్రబాబుకు పునాది కాంగ్రెస్ అని.. ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని మోహన్ బాబు విమర్శించారు. చంద్రబాబు గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఇలా 365 రోజులూ చెప్పుకుంటూ పోవచ్చని మోహన్ బాబు అన్నారు.


జగన్‌కు ఒకసారి అవకాశం ఇద్దాం..

ప్రజల సమస్యలను తీర్చడానికే వైఎస్ జగన్ వస్తున్నారు. వైఎస్ జగన్‌కు ఒక్కసారి చాన్స్ ఇద్దాం. జగన్ గత పదేళ్లుగా ఏకధాటిగా రాష్ట్రమంతా తిరుగుతూనే ఉన్నారు. ఆయన 365 రోజులు పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి జగన్. ఆయనకు అనుభవం లేదని అనడం కరెక్ట్ కాదు. ఒక్కసారి చాన్స్ ఇస్తే అనుభవం అదే వస్తుంది. ఇండస్ట్రీ కొత్తలో నాకు కూడా అనుభవం లేదు. తర్వాత నేను నటించలేదా? నన్ను నేను ప్రూవ్ చేసుకోలేదా? జగన్ కూడా పాలనలో అనుభవం సంపాదిస్తారు… అని మోహన్ బాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version