గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపేందుకు నేడు సభను నిర్వహిస్తుండగా.. అది కాస్త బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గవర్నర్ చేత 36 నిమిషాల ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అధికార పార్టీ మీద విరుచకపడ్డారు. దీనికి గవర్నర్ మనసు ఎంత నొచ్చుకుని ఉంటుందోనని అన్నారు.
ఆయన మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేయగా.. అన్ని మూస్కోని కూర్చొండని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందిస్తూ.. ‘మమ్మల్నే అన్ని మూసుకుని కూర్చోండి అంటాడా.. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే. సభలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. గవర్నర్ అంటే గౌరవం లేదు.నువ్వెవరని ఏకవచనంతో స్పీకర్ను ఎట్లా అనగలుగుతారు’ అని ఆది శ్రీనివాస్ సీరియస్ అయ్యారు.