ఏపీ ఎన్నికలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ గెలవడం ఖాయమన్నారు. ఇవాళ వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.
ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఎవరు వస్తారు.. అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని.. ఫెడరల్ ఫ్రంట్‌లోకి జగన్ కూడా వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశంలో బీజేపీ అంటూ పడని వాళ్లు, కాంగ్రెస్ అంటే పడని వాళ్లు చాలామంది ఉన్నారన్నారు. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేశ్ యాదవ్, ఏపీలో జగన్.. వీళ్లంతా ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తారని కేటీఆర్ సభలో వెల్లడించారు.
ఏపీలో ఇప్పటికే వార్ వన్‌సైడ్ అన్నట్టుగా ఏపీ ప్రజలంతా వైసీపీవైపే మొగ్గు చూపుతున్నారు. ఆ విషయం జగన్ ఎన్నికల ప్రచారంలోనే తెలిసిపోతోంది. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో వస్తున్న జనసందోహాన్ని చూస్తే అర్థమవుతోంది. మరోవైపు అధికార టీడీపీ నుంచి ముఖ్యమైన నేతలంతా వైఎస్సార్సీపీలో చేరడంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో ఏపీలో జగన్ గెలుపు ఖాయమైపోయింది.