నాయకుల్లో వైసీపీ నాయకులు తీరే వేరు
వారు బూతులు మాట్లాడతారు
రౌడీయిజం చేస్తారు తిడతారు తంతారు ఏం చేసినా
భరించే శక్తి ఉండాలి లేదంటే వివాదాలే
వరుస వివాదాలతో వైసీపీ ప్రజాప్రతినిధులు ఇరుక్కుంటున్నారు. నిన్నమొన్నటి వేళ విశాఖ జిల్లా,శారదా పీఠంలో మంత్రి సీదిరి సృష్టించిన వివాదం మరువక ముందే మరో వివాదం రేగింది. విజయవాడ కేంద్రంగా ఎంపీ నందిగం సురేశ్ రెచ్చిపోయారు.కృష్ణలంక పోలీసు స్టేషన్లో హల్చల్ చేశారు.దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారే తప్ప ఆయనను నిలిదీసి అడిగేవారే లేకపోయారు. దీంతో మళ్లీ మరో వివాదం తో జగన్కు కొత్త తలనొప్పులు తప్పేలా లేవు.
వివాదం ఏంటంటే ?
ఎంపీ అనుచరులు పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు.ఈ యువకులను పోలీసులు అదుపులో తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించగగా అక్కడ కూడా వీరంతా రెచ్చిపోయి రంకెలేశారు. ఎంపీ సురేశ్ అక్కడికి చేరుకుని వీరికి వంత పాడారు. దీంతో సమస్య మరింత జఠిలం అయింది. ఎంపీ అనుచరుల వీరంగాన్ని వీడియో బంధించాలి అని అనుకున్న కానిస్టేబుల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మొబైల్ లాక్కోవడమే కాకుండా ఆయనపై కూడా ఎంపీ అనుచరులు రెచ్చిపోయారు. తన మొబైల్ తనకు ఇవ్వాలని కోరిన కానిస్టేబుల్ కు చుక్కలు చూపించారు.దీంతో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.