ఎంపీ రేవంత్ మిస్సింగ్..గులాబీ స్కెచ్?

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో కే‌సి‌ఆర్ సర్కార్‌కు చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే టి‌పి‌సి‌సి హోదాలో ముందుకెళుతున్నారు..కానీ ఆయన మల్కాజిగిరి ఎంపీ అనే సంగతి తెలిసిందే. అయితే ఎంపీగా అసలు ఏం పనిచేస్తున్నారో ఎవరికి తెలియదు. మల్కాజిగిరి ప్రజల కోసం ఇంతవరకు ఆయన ఏం చేశారో తెలియదు. అలాగే పార్లమెంట్ లో కూడా పెద్దగా కనిపించినట్లు ఉండరు.

ఇటు ఎంపీ నిధులతో మల్కాజిగిరిలో అభివృధ్ది పనులు చేస్తున్నట్లు కనిపించరు. కేవలం ఆయన టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగానే ముందుకెళుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే హైదరాబాద్‌ని వరదలు ముంచెత్తిన సరే స్థానిక ఎంపీ అడ్రెస్ లేరంటూ పోస్టర్లు వేలుస్తున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అని పోస్టర్లు వెలిశాయి. 2020లో వరదల సమయంలోనూ..2023లోనూ ఆయన కనిపించడం లేదని పోస్టర్లు వేశారు.

అయితే తెలంగాణ రాజకీయాల్లో ఈ పోస్టర్లు కామన్. ఏదో సామాన్య జనం వేసినట్లు పోస్టర్లు పెడతారు గాని..ఇదంతా రాజకీయ పార్టీల లని ఇట్టే అర్ధమవుతుంది.  ఇక ఇది చేసింది బి‌ఆర్‌ఎస్ పార్టీ అని కాంగ్రెస్ అంటుంది. అది కూడా వరద బాధితులను ఆదుకోవాలని.. హైదరాబాద్‌ లో ముంపు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, అలాగే వరద బాధితులకు తక్షణమే రూ.10 వేలు సాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ.. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ముట్టించిన సమయంలోనే ఈ పోస్టర్లు వచ్చాయి. అంటే ఇది బి‌ఆర్‌ఎస్ స్కెచ్ అని అర్ధమైపోతుంది. ఇక ఎవరి రాజకీయం వారిది. చివరికి ప్రజలు ఎవరిని నమ్మితే వారే కరెక్ట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version