బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఓ మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తుందంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. సాక్షిగా పిలిచిన మహిళను తమ ఇంటి వద్ద లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని.. కానీ సిఆర్పిసి సెక్షన్ 160 ఉల్లంఘించి తనని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారని కవిత పేర్కొన్నారు.
ఈడి అధికారులు తనని మానసిక, శారీరక ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. గతంలో పలు ఉదాహరణలు ఉన్నాయని కవిత తెలిపారు. అయితే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసరం స్పష్టం చేసింది. ఆరు వారాలలో గా కౌంటర్ దాఖలు చేయాలని ఈడిని ఆదేశించింది సుప్రీంకోర్టు. మరో రెండు వారాలలో రిజైండర్ దాఖలు చేయాలని ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాదులను ఆదేశించింది.