నేను హర్టయ్యా.. పవన్ కి రాసిన లేఖలో ముద్రగడ వ్యాఖ్య

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి మళ్లీ లేఖలను సంధిస్తున్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. జనసేనలో ముద్రగడ చేరబోతున్నారనే టాక్ మొన్నటి వరకు నడిచింది. అటు ముద్రగడ కూడా పవన్ ఆహ్వానం కోసం ఎదురుచూశారు.కానీ జనసేన నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోవడంతో ముద్రగడ హార్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన రాసిన లేఖ చూస్తే అందరికీ అదే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాడేపల్లి గూడెం జెండా సభలో పవన్ మాట్లాడుతూ తనతో వచ్చే వాళ్లంతా పోరాడే వాళ్లు అయి ఉండాలే కానీ సలహాలు ఇచ్చే వాళ్లు ఉండకూడదని తెగేసి చెప్పేశారు. ఈ మాటలు కూడా ముద్రగడను బాగా ఇబ్బంది పెట్టినట్లు లేఖ చూస్తే అర్థమవుతోంది.

2019లో జరిగిన ఓ సంఘటనను ఇప్పుడు గుర్తుచేసుకుంటు ముద్రగడ లేఖ సంధించారు.2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నాను. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించాను. మీరు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారని నమ్మాను కానీ దురదృష్టవశాత్తు మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదండీ…అంటూ పేర్కొన్నారు.

చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టి.డి.పి కేడర్‌ బయటకు రావడానికి భయపడితే తమరు జైలుకి వెళ్లి వారికి భరోసా ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని చెప్పారు.టీడీపీ పరపతి విపరీతంగా పెరగడానికి పవన్ కారణమని పేర్కొన్నారు.లేఖలో ముద్రగడ ఇంకా ఏమన్నారంటే…. పవర్‌ షేరింగ్‌కు ప్రయత్నించి 80 సీట్లు అడగడంతో పాటు మిమ్మల్ని రెండేళ్లు సీఎంగా చేయమని కోరి ఉండాలండి..అని అన్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయులేదండి.తమరిలాగా గ్లామర్ ఉన్న వ్యక్తిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని కావడం వల్ల లాస్ట్ గ్రేడ్‌ వ్యక్తిగా ఉంటానని అన్నారు.చివరగా-మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు రాకూడదనిని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానండి.” అంటూ ముద్రగడ లేఖను ముగించారు.దీనిని బట్టి చూస్తే పవన్ పట్ల ముద్రగడ ఎంతగా హర్ట్ అయ్యారోనని జనాలు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version