తండ్రి అడుగుజాడల్లో.. ప్రజల సేవకై సిద్దమైన యువ నాయకుడు

-

ఇంజినీరింగ్ చదివి, తరువాత లా పట్టా పొంది.. ఎన్నో ఉద్యోగాలను కాదనుకొని, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాల్లో అడుగు పెట్టారు పోతుగంటి భరత్ ప్రసాద్. జెడ్పీటీసీ కల్వకుర్తి  మరియు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొదలైన భరత్ రాజకీయ ప్రస్థానం ఈరోజు పార్లమెంట్‌లో నాగర్ కర్నూల్ ప్రజల కష్టాల గొంతుక వినిపించడానికి సిద్ధమయ్యారు. పదవితో సంబంధం లేకుండా ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడిన భరత్​ ప్రసాద్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చి ప్రజల ముందుకి తీసుకు వచ్చింది. ఎవరీ భరత్ ప్రసాద్..?

పోతుగంటి భరత్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1987 ఆగష్టు 7న తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం, గుండూరు గ్రామంలో పి.రాములు, భాగ్యలక్ష్మి దంపతులకు భరత్ జన్మించాడు. జెఎన్టీయూ నుంచి బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి న్యాయ వృత్తి మీద ఉన్న ఇష్టంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ చదివి నల్ల కోర్టు ధరించారు.

తన తండ్రి అడుగు జాడల్లో 2019లో రాజకీయాల్లో అడుగుపెట్టిన భరత్ ప్రసాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం 2024 ఫిబ్రవరి 29న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన తండ్రితో కలిసి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన భరత్‌ప్రసాద్‌ను నాగర్‌కర్నూల్‌ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది.

నాగార్ కర్నూల్ ప్రజలకు మేలు చేయడానికి అహర్నిశలు కష్టపడే భరత్ ప్రసాద్‌ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే మోడీ సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. నేటి యువతే రేపటి భవిష్యత్తు అనే నమ్మే ప్రధాని‌ నరేంద్ర మోడీ యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఉద్దేశంతో నాగర్ కర్నూల్ అభ్యర్థిగా యువకుడు, విద్యావంతుడు, నాగర్ కర్నూల్ ప్రజల కష్టాలు తెలిసిన స్థానికుడికి ఈ అవకాశం కలిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version