నల్లారి సోదరుడు ఈ సారి వదిలేలా లేరు..!

-

ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చాలామంది టీడీపీ నేతలు తెగ కష్టపడుతున్నారు…గత ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమికి బదులు తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి విజయం అందుకోవాలని అనుకుంటున్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి జగన్ గాలి తక్కువ ఉండొచ్చు…అలాగే టీడీపీకి అనుకూల పవనాలు కూడా వీస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా గెలిచి తీరాలని కొందరు టీడీపీ నేతలు కసిగా పనిచేస్తున్నారు.

అలా ఈ సారి వదలకుండా గెలిచి తీరాలని పనిచేస్తున్న వారిలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. 2014లో కిరణ్ పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి…వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి పీలేరు బరిలో ఓడిపోయారు. వైసీపీ తరుపున చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. ఇక తర్వాత కిరణ్ రాజకీయాలకు దూరం జరగడంతో..కిషోర్ టీడీపీలోకి వచ్చేశారు.

ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో పీలేరు బరిలో మరోసారి దిగి పరాజయం పాలయ్యారు. జగన్ వేవ్ లో వైసీపీ నుంచి మళ్ళీ చింతల గెలిచేశారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఈ ఇద్దరే మళ్ళీ ప్రత్యర్ధులుగా బరిలో దిగబోతున్నారు. మరి ఈ సారి కూడా చింతలకు కలిసొస్తుందా? అంటే అబ్బే కష్టమే అని చెప్పాలి. ఇప్పటికే అధికార ఎమ్మెల్యేగా ఉన్న చింతలపై ప్రజల్లో సానుకూలత పెద్దగా కనిపించడం లేదు. అలాగే అధికారంలో ఉన్నా సరే పీలేరులో చేసిన అభివృద్ధి తక్కువే.

అటు టీడీపీలో నల్లారి దూకుడుగా పనిచేస్తున్నారు…ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో ముందుకెళుతున్నారు. ఇప్పటికే పీలేరులో కిషోర్ గెలుపుకు అనుకూల పరిస్తితులు ఉన్నాయి. ఇటీవల వస్తున్న సర్వేలు కూడా కిషోర్ కు అనుకూలంగానే ఉన్నాయి. అంటే ఈ సారి ఖచ్చితంగా కిషోర్ పీలేరులో పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఈ సారి గెలిచే వరకు నల్లారి వదిలేలా లేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version