తెలంగాణ ఏర్పడిన తరువాత జరుగుతున్న మూడో ఎన్నికల్లో విజయం సాధించాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి పార్టీ తమ బలాబలాలను పరిశీలించుకుంటూ ప్రజల ముందుకు వెళుతున్నారు. తెలంగాణలో బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు పలు పార్టీలు రేసులో ఉన్నాయి. అలాగే ఇందులో ఎంఐఎం కూడా కీలకం గా ఉంది ఎంఐఎం కి కూడా కొన్ని నియోజకవర్గాలలో పట్టుంది. అటువంటి నియోజకవర్గాల్లో ముఖ్యమైనది నాంపల్లి.
నాంపల్లి నియోజకవర్గంలో 60% పైగా ఓటర్లు ముస్లిం ఓటర్లు. ఈ నియోజకవర్గంలో గెలుపును శాసించేది కూడా ముస్లిం ఓటర్లే. అందుకే వరుసగా ఎంఐఎం గెలుస్తుంది. కానీ ఈసారి మజ్లిస్ కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఎంఐఎం ఊహించని విధంగా అభ్యర్థిని మార్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేరాజ్ హుస్సేన్ ని పక్కన పెట్టి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మెహిదీపట్నం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్ ని బరిలో దింపింది. ఈయన ప్రచారం లో దూసుకెళుతున్నారు. అటు ఫిరోజ్ సైతం దూకుడు గానే ఉన్నారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ పోటీలో ఉన్నాయి. కానీ ప్రధాన పోటి ఎంఐఎం, కాంగ్రెస్ మధ్యే. మరి ఈసారి నాంపల్లి లో ఎవరు పాగా వేస్తారో చూడాలి.