ఏపీలో బీజేపీ పరిస్తితి మరీ ఘోరంగా ఉన్న విషయం తెలిసిందే. విభజన హామీలు, ప్రత్యేక హోదా లాంటి అంశాలని నెరవేర్చని బీజేపీపై, ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో దేశంలో బీజేపీకి లీడింగ్ వచ్చిన, ఏపీలో మాత్రం 1 శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేదు. నోటాకు వచ్చిన ఓట్లు బీజేపీకి రాలేదు. అయితే ఎన్నికలయ్యాక బీజేపీ, పవన్ కల్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకుని బలపడాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈయన ఎంతసేపు చంద్రబాబునే టార్గెట్ చేస్తూ, విమర్శలు చేసేవారు. అలాగే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ నేతలని సైలెంట్ చేశారు. ఇలా సోము రాజకీయంతో బీజేపీ మరింతగా ఎదగకుండా ఉండిపోయింది. ఈ క్రమంలోనే సోముని అధ్యక్ష పీఠం నుంచి తప్పించాలని బీజీపీ అధిష్టానం చూస్తున్నట్లు ప్రచారం మొదలైంది. మళ్ళీ కన్నాకే పగ్గాలు అప్పగిస్తారని కథనాలు వచ్చాయి.
అయితే అందులో భాగంగానే అనుకుంటా కన్నా మళ్ళీ లైన్లోకి వచ్చారు. జగన్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అంటే అధ్యక్ష పీఠం కన్ఫామ్ అవుతుందనే హింట్ రావడంతో కన్నా ఫీల్డ్లోకి దిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే సోముని సైడ్ చేసి, కన్నాకు అధ్యక్ష పీఠం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి ఏపీకి కొత్త అధ్యక్షుడు వస్తారో? రారో?