మల్కాజిగిరిలో ఈటెల వన్ మ్యాన్ షో… పోటీ ఇవ్వలేకపోతున్న ప్రత్యర్థులు

-

తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లో వచ్చేనెల 13న ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రణాళికతో ప్రచారం చేస్తూ తన అభ్యర్ధులను గెలిపించుకునే ప్రయత్నo చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.అయితే మల్కాజిగిరి పరిధిలో మాత్రం ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమే దూసుకుపోతున్నారు.అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఇక్కడ ప్రచారంలో కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు.ఇక్కడ రాజేందర్ విజయం లాంఛనమే అంటున్నారు ఓటర్లు.

మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం.. దేశంలోనే అతిపెద్ద లోక్‌ సభ స్థానం.మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కూకట్ పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఐదు నియోజకవర్గాలు… రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను కలిపి 2009లో మల్కాజిగిరి లోక్‌ సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. 30 లక్షలకు పైగా ఓట్లున్న అతిపెద్ద లోక్ సభ స్థానం ఇది. ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ లో కీలకమైంది. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల వారు నివాసముంటారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల ప్రజలు కలిసి ఉండే నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువు కాదు.కానీ ఈటెల రాజేందర్ ఇక్కడి ఓటర్ల మనసులు గెలుచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనకు పెద్ద ఎత్తున నీరాజనం పలుకుతున్నారు.

మల్కాజిగిరి పరిధిలో కాంగ్రెస్ తరపున సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.బీఆర్ఎస్ తరపున రగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు.ఈ లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ నేతలను గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలు కానీ కాంగ్రెస్ తరపున నాయకులు కానీ ప్రచారంలో ఎక్కడా కనిపించడంలేదు.కాంగ్రెస్ తరపున మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ లీడింగ్ లీడర్.కనీసం ఆయన కూడా కనిపించిన దాఖలాలు లేవు. నిన్న మాజీమంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ విజయం తథ్యం అని తెలుస్తోంది. అందుకనే ప్రత్యర్థి పార్టీలు ప్రచారానికి రావడం లేదని వాదన వినిపిస్తోంది.అటు సర్వేలు కూడా మల్కాజిగిరి రాజేందర్ దే అని తేల్చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version