టీడీపీని వీడటంపై పరిటాల శ్రీరాం క్లారిటీ…!

-

తాము పార్టీ మారేది లేదని, తమ తండ్రి సిద్దాంతాలతో ముందుకి వెళ్తామని, తెలుగుదేశం పార్టీ యువనేత, దివంగత పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక లేఖ రాసారు. ట్విట్టర్ వేదికగా… ఆయన పార్టీ మారతారు అనే ప్రచారాన్ని ఖండించారు. తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్బ్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

మా నాన్న పరిటాల రవీంద్ర గారి సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజాభివృద్ధిని కాంక్షిస్తూ నిత్య ప్రజాసేవలో కొనసాగుతున్నాం. అలాంటి మా మీద కన్నతల్లి లాంటి పార్టీ మారుతున్నట్లు తీవ్రమైన దుష్ప్రచారాన్ని చేస్తున్న మూర్ఖులు అందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలం.. పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు రాబోదు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే కుసంస్కృతి మాకు లేదు.

తరాలు మారినా తరగని అభిమానంతో పసుపు జెండా కోసం పని చేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఇకనైనా ఇలాంటి రాతలు రాసే వారు నీతి మాలిన రాతలు మాని సమాజంలో నీతిగా బతకండని పరిటాల శ్రీరాం మీడియాకు లేఖ రాసారు. జిల్లాలో టీడీపీ లో జేసి కుటుంబానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు పార్టీ మారాలని అనుకుంటున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version