పవన్ చెప్పిందే బాబు చెబుతున్నారే..స్కెచ్ ఉందా?

-

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..పైకి వేరు వేరుగా రాజకీయం నడిపిస్తున్నట్లు కనిపిస్తున్నారు..కానీ అంతర్గతంగా వారి టార్గెట్ గాని..వారు చేసే విమర్శలు గాని ఒకటిగానే ఉంటున్నాయి. మొన్నటివరకు చంద్రబాబు…జగన్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసేవారో..అవే పవన్ కూడా చేస్తూ ఉండేవారు. వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసు..ఇలా పలు అంశాలని టార్గెట్ చేసేవారు.

ఇప్పుడు పవన్ ఏం మాట్లాడుతున్నారో అవే చంద్రబాబు, టి‌డి‌పి నేతలు మాట్లాడుతున్నారు. ఇటీవల పవన్…వైసీపీ ప్రభుత్వంలోని వాలంటీర్లని ఎక్కువ టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చాలామంది మహిళలు కనిపించకుండా పోతున్నారని, దానికి కారణం వాలంటీర్లు అని అంటున్నారు. ఏ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు..వితంతవులు, ఒంటరి మహిళల సమాచారాన్ని సేకరించి వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని అన్నారు.

అలాగే రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోని డేటాని సేకరించి ఐప్యాక్ సంస్థకు ఇస్తున్నారని, అలాగే ప్రతి ఒక్కరి ఆధార్ డేటా…హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉందని ఆరోపణలు చేశారు. వీటికి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. కానీ పవన్ బాటలోనే తాజాగా బాబు కూడా అవే తరహా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మహిళల మిస్సింగ్ పై పవన్ చెప్పిన లెక్కలనే బాబు చెప్పారు. అలాగే హైదరాబాద్ లోని కంపెనీకి ప్రతి ఒక్కరి ఆధర్ డేటా వెళుతుందని టి‌డి‌పి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఇలా బాబు-పవన్ ఒకే తరహాలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు…కాకపోతే ఒకరి ముందు..మరొకరు వెనుక అన్నట్లు ఉన్నారు. అంటే ఇద్దరు నేతలు కలిసే వైసీపీని గద్దె దించే ప్రయత్నాలు చేస్తున్నారని అర్ధమైపోతుంది. రానున్న ఎన్నికల్లో వారు ఖచ్చితంగా పొత్తు దిశగానే వెళుతున్నారని తెలుస్తుంది. అందుకే ముందు నుంచి ఒక అండర్‌స్టాండింగ్ తో పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version