జనసేన అధినేత పవన్ మళ్ళీ పట్టు వదిలేశారు. వారాహి యాత్ర అంటూ కొన్ని రోజులు హడావిడి చేసి..మళ్ళీ సినిమాల షూటింగులకు వెళ్ళి..జనసేనని రాజకీయంగా ఇబ్బందుల్లో నెట్టేశారా? అంటే ప్రస్తుత పరిణామాలని చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. వారాహి యాత్ర అంటూ మూడో విడతల్లో యాత్ర చేసి..వైసీపీపై విరుచుకుపడ్డారు. ఒకోసారి పొత్తులపై క్లారిటీ, మరోసారి కన్ఫ్యూజ్ చేస్తూ ముందుకెళ్లారు.
సరే ఏదైనా చేయని..పవన్ టూర్ వల్ల జనసేనకు రాజకీయంగా కాస్త పట్టు దొరికింది. ఆ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో సత్తా చాటే దిశగా వెళ్లింది. ఇలాంటి సమయంలో పవన్ పూర్తిగా రాజకీయాల్లో ఉంటే ఎలాంటి తలనొప్పి ఉండేది కాదు..అదే ఫ్లో కంటిన్యూ చేస్తే జనసేనకు ఇంకా బలం పెరిగేది. కానీ పవన్ మళ్ళీ వదిలేశారు..సినిమాల వైపుకు వెళ్లారు. మొన్నటివరకు సినిమా షూటింగులు చేసుకుంటూ రాజకీయం నడిపించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎన్నికల సమయంలో కూడా పవన్ అదే పంథాలో ముందుకెళితే..జనసేన పార్టీకే ఇబ్బంది.
పవన్ తిరిగినప్పుడే రాష్ట్రంలో జనసేన బాగా కనబడుతుంది. లేదంటే ఆ పార్టీ ఎక్కడా కనిపించదు. ఏదో కొందరు నేతలు మాత్రమే తమ నియోజకవర్గాల పరిధిలో పనిచేసుకుంటున్నారు. ఇంకా ప్రధానంగా టిడిపి, వైసీపీల మధ్యే రాజకీయ యుద్ధం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. దీంతో జనసేన వెనుకబడి పోయి ఉంది.
ఈ పరిణామాల వల్ల ఎన్నికల్లో జనసేన సత్తా చాటడం అనేది కష్టమైపోతుంది. కాకపోతే పవన్..కేవలం టిడిపితో పొత్తుపై ఆధారపడినట్లు కనిపిస్తున్నారు. అందుకే జనసేనని పూర్తిగా బలోపేతం చేసే అంశాన్ని లైట్ గా తీసుకున్నారు. పొత్తు ఉంటే పర్లేదు..లేదంటే జనసేన బిజేపితో కలిసి ముందుకెళ్లిన..పెద్దగా సత్తా చాటలేదు.సింగిల్ డిజిట్ సీట్లు దాటడం కష్టమే.